పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ తెలంగాణ అంటూ సభ పెడుతున్నట్లు తనకు సమాచారం అందిందనీ, ఐతే తను పవన్ కల్యాణ్ కు ఓ సలహా ఇస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆమె మాటల్లోనే... పవన్ కల్యాణ్ గారూ... మీరు ఇక్కడ నవ నిర్మాణ తెలంగాణ సభ పెట్టడం మాట అట్లా పెట్టండి. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి. వానాకాలం రాబోతోంది. మీ సెక్రటేరియట్, మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ ఎగతాళి చేసారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.... ప్రతి వానాకాలం అక్కడి క్యాపిటల్ మునుగుడే. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వస్తున్నారు. గత 12 ఏళ్లుగా మీ ఆంధ్రలో కనీసం ఒక్క మంచి ఆసుపత్రి కూడా కట్టుకోలేకపోయారు. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి అంటూ ఎగతాళి చేసారు.
