1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Pawan Kalyan interesting comments on Telangana Politics Candidate contest in Election

ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు.. ఆంధ్రా నేతలు కాదు : పవన్ కళ్యాణ్

pawan kalyan
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై జరిగే ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు ఎవరూ పోటీ చేయరని స్పష్టంచేశారు. 
 
బుధవారం ఆయన అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతిలోని 58 అడుగులు అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆయన సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయులను కులాలకు పరిమితం చేసే ధోరణిని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ  హయాంలోనే కుల రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయానని, వాటిని ఎదుర్కొనేందుకే సేనా గళం కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
 
తెలంగాణాలో జనసేన పార్టీ తరపున అక్కడి స్థానికులే పోటీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరూ అక్కడికి వెళ్లి పోటీ చేయబోరని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే ఆ ప్రాంత నేతలకు అభ్యంతరం ఎందుకు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గద్దర్ కుటుంబం పట్ల, కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని, అయితే, దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని, మాజీ మంత్రి కేటీఆర్ తనకు సోదరుడు అని అన్నారు. 
 
అంతేకాకుండా, తెలంగాణాలో పోటీ చేసే హక్కు అక్కడి భూమిపుత్రులకే ఉంటుందని అనడం సరికాదని, ఇతరులు పోటీ చేయకూడదని అభ్యంతరాలు చెప్పడం తగదన్నారు. పైగా తెలంగాణ ఎవరి జాగీరు కాదని, అక్కడి రాజకీయాల్లో జనసేన భాగస్వామ్యంపై వస్తున్న విమర్శలకు అర్థం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Ai+ Smartphone మే 2026లో 3 లక్షల యూనిట్లు, ₹350 కోట్లకు పైగా రాబడి