మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (16:47 IST)

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు రావని పవన్ రావడంలేదు: ఎమ్మెల్యే అనిరుధ్

pawan kalyan
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయన్న విషయం తెలుసుకుని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ కు నిర్మాత చంద్రబాబు అనీ, సహ నిర్మాత లోకేష్ అయితే తెలంగాణలో మాత్రం కొత్త నిర్మాత మోడీని వెతుక్కున్నారంటూ సెటైర్లు వేసారు.
 
జనసేన అనేది కేవలం ఆంధ్ర పార్టీ అనీ, అది తెలంగాణకు వచ్చి పెత్తనం చేస్తామంటూ ఇక్కడి ప్రజలు ఊరుకోరు, కోనసీమకు తెలంగాణవాళ్ల నరదిష్టి తగిలిందంటూ వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్ ఇక్కడివారికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఆంధ్రవాళ్లు కేవలం ఇక్కడ వున్న భూములు కోసం వస్తారు తప్పించి మరిదేని కోసమూ రారని అన్నారు. 
 
కొండగట్టు ఆంజనేయస్వామివారికి తితిదే నిధులు ఇచ్చి ఆ నిధులు తనే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమా హీరోగా ఆయన సినిమాలు చూస్తాం అంతేగానీ బీజేపీతో పొత్తు అంటూ ఇక్కడికి వస్తే డిపాజిట్లు గల్లంతవుతాయంటూ చెప్పుకొచ్చారు.