1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Pregnant Woman Dies by Suicide in Sangareddy

రెండో అంతస్థు నుంచి దూకి ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య... కారణం?

Pregnant
కుటుంబ కలహాల కారణంగా ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఆరు నెలల గర్భిణి ఒకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. హోతి (కె) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కుటుంబ వివాదం కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి.
 
పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కారు అదుపు తప్పి కాలువలో పడింది.. డాక్టర్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల మృతి