1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. South Central Railwy announces the cancellation of several trains due to interlocking works

ప్రయాణికులకు అలెర్ట్ : 18 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే

Trains
కాజీపేట - కొండపల్లి మార్గంలో ఇంటర్ లాకింగ్, ఇతర ఇంజనీరింగ్ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే రైళ్లలో 18 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లో డోర్నకల్, గుండార్తిమడుగు స్టేషన్ల మధ్య 3వ లైన్ ట్రిప్లింగ్ నిర్మాణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు, ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 
 
రద్దు చేసిన రైళ్లలో కాజీపేట, విజయవాడ - డోర్నకల్, సికింద్రాబాద్, విజయవాడ - భద్రాచలం, మణుగూరు, విశాఖపట్టణం - పాలమూరు, రైళ్లతో పాటు కాకినాడ టౌన్, లింగంపల్లి రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు అడ్వాన్స్‌ బుకింగ్ ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా రైల్వే ముందస్తు ప్రకటన జారీచేసింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి