సంబంధిత వార్తలు
- కూకట్పల్లిలో 9 స్క్రీన్ సినిమా ప్రారంభంతో హైదరాబాద్కు కొత్త వినోదం
- బర్త్ డే సెలబ్రేషన్ కోసం లిఫ్టులో హైడ్రోజన్ బెలూన్లు, బాంబుల్లా పేలాయి, వీడియో
- తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు రావని పవన్ రావడంలేదు: ఎమ్మెల్యే అనిరుధ్
- హైదరాబాద్లో RS457 ట్రాక్ డే: వాహన చోదకుల నైపుణ్యాభివృద్దిని వేగవంతం చేస్తోన్న అప్రిలియా ఇండియా
- నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తా: వివాహితుడు బెదిరింపుతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య
ఇదిగో ఈ 50 వేలు తీసుకుని చెప్పులు షాపు పెట్టుకో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాయం
జగ్గారెడ్డి. ఆయన మాట తీరు వేరు. అలాగే ఆయన అందరికంటే డిఫరెంట్. సాయం చేయడంలో కానీ, ముక్కుసూటిగా మాట్లాడటంలో కానీ. సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. చెప్పిన మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు కూడా. మరోసారి జగ్గారెడ్డి తన పెద్దమనసును చాటుకున్నారు.
రోడ్డు ప్రక్కనే చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న కార్మికుని వద్దకు వచ్చి అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు ఎంతని అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కుట్టుకుంటూ చిన్న డబ్బాలా ఏర్పాటు చేసి మరిన్ని చెప్పులు పెడితే కాస్తంత డబ్బులు వస్తాయంటూ కార్మికుడు చెప్పడంతో, దానికయ్యే ఖర్చు ఎంత అని అడిగారు. అతడు రూ. 50 వేలు అవుతాయని చెప్పడంతో అప్పటికప్పుడు తన జేబు నుంచి రూ. 50 వేలు ఇచ్చి ఆ డబ్బుతో షాపుకి అవసరమయ్యేవన్నీ కొనుగోలు చేయమని చెప్పారు. జగ్గారెడ్డి సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు..
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2026
చెప్పులు కుట్టుకునే వ్యక్తికి రూ. 50 వేలు సాయం చేశాడు. pic.twitter.com/4NdFoIUbLw
