1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana Govt Raises Upper Age Limit to 44 for Direct Recruitment

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

jobs
రాష్ట్రంలోని నియామక సంస్థల ద్వారా వివిధ ఉద్యోగ విభాగాల్లో త్వరలో జరగనున్న ప్రత్యక్ష నియామకాల కోసం, యూనిఫాం సర్వీసులు (పోలీసు, అగ్నిమాపక తదితర విభాగాలు) మినహా ఇతర ఉద్యోగాలకు సంబంధించి, గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు అంటే 10 ఏళ్లు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ మేరకు సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేయబడింది. ప్రత్యక్ష నియామక ప్రక్రియలో పోటీపడేందుకు మరింత మంది నిరుద్యోగ యువత అర్హత పొందేలా, గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగ యువత నుండి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. 
 
ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, గరిష్ట వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
రెండో భర్తను ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసిన భార్య.. ఎక్కడ?