శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (15:43 IST)

తెలంగాణ పల్లెపోరు : ఉప సర్పంచ్ అయిన టెక్కీ

vote
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక యువకుడు టెక్కీ ఉద్యోగానికి రాజీనామా చేసి, వార్డు సభ్యుడుగా గెలుపొంది, ఉప సర్పంచ్ అయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. 
 
ఈ ఎన్నికల్లో అదేగ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
అతని తల్లిదండ్రులు గత 18 యేళ్లుగా గ్రామంలో వివిధ పదవుల్లో కొనసాగారు. వారి అడుగు జాడల్లో నడవాలని భావించిన ప్రవీణ్ కుమార్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వార్డు మెంబరుగా పోటీ చేసి గెలిచాడు. 
 
నిజానికి గ్రామ సర్పంచ్ కావాలని భావించాడు. కానీ, రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తన అనుచరుడిని సర్పంచ్‌గా పోటీ చేయించి, తాను ఉప సర్పంచ్ అయ్యాడు. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో మూడో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు.
 
తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కిస్తున్నారు. సర్పంచ్‌ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్‌, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.