1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana state bjp chief Ramchander Rao Condemns Denial of Permission for Janasena Meeting as Undemocratic

పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే కాంగ్రెస్ - బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోంది : రామచంద్రరావు

ramachandar rao
తెలంగాణ గడ్డపైకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అధికార కాంగ్రెస్, విపక్ష భారత రాష్ట్ర సమితి పార్టీల నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ నగరంలో జనసేన సభకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది రెండు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్ర రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరు, ఎక్కడైనా సభలు, సమావేశాలు జరుపుకోవచ్చన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికి మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ ఎలా కలిసి పని చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసినట్టు కాదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పరిస్థితులు బట్టి తెలంగాణాలో పొత్తుపై ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చనిపోయిన తండ్రి కోర్కె తీర్చడం కోసం సిగరెట్ దమ్ము కొట్టి నైవేద్యం పెట్టిన కుమార్తె, వీడియో