ఆదివారం, 15 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా... మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వు...

vote
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళుతోంది. విపక్ష పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పదుల సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓట్ల లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ లేఖ కనిపించింది. సూర్యాపేటలోని 47వ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విశ్రాంత ఉద్యోగి ఒకరు ఈ లేఖ రాశారు. అందులో ఏముందంటే... 
 
"ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా... మేము రిటైర్ అయి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా రాలేదు. ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ, అనారోగ్యం పాలవుతూ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు 62 మంది చనిపోయారు. అందుకే మా బాధతో మేము చనిపోకముందై మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం' అని పేర్కొన్నారు.