1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. That God, Pawan Kalyan, has come; my son is now at ease: Niranjan-s father in a video

ఆ దేవుడు పవన్ కల్యాణ్ వచ్చిండు, నా కొడుకు నిమ్మళమయ్యుండు: నిరంజన్ తండ్రి వీడియో

Niranjan father
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ అరుదైన వ్యాధితో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే అతడిని కలిసి అతడి కోరినవన్నీ నెరవేర్చారు. నిరంజన్ తండ్రి మాట్లాడుతూ... వాడు అనుకున్న చివరి కోరిక నెరవేరింది. ఆ దేవుడొచ్చిండు. నా కొడుకు నిమ్మళమైండు. చాల్రా ఈ కష్టాలు పడకరా నాన్న అని దీవించిండు. వాడకది చాలు సార్, ఆ దేవుడు పవన్ కల్యాణ్. నా దేవుడు పవన్ కల్యాణ్‌ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అంటూ ఉద్వేగంగా చెప్పారు.
 
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది: పవన్ కల్యాణ్
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
 
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
 
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
 
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు,  ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 
About Writer
ఐవీఆర్