1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. They are trying to have me admitted to Erragadda in order to usurp my home in Jubilee Hills: Actress Sajini expresses anguish

జూబ్లిహిల్స్‌లో నా ఇంటిని కాజేసేందుకు నన్ను ఎర్రగడ్డలో చేర్చాలని చూస్తున్నారు: నటి సజినీ ఆవేదన

Sajini
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో తను నిర్మించుకున్న ఇంటిని కాజేసేందుకు తన సొంత సోదరి, ఆమె పిల్లలు తనపై దాడి చేస్తున్నారనీ, తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారని మలయాళ నటి సజినీ ఆవేదన వ్యక్తం చేసారు. తన ఇంటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారనీ, తనపై భౌతిక దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ... 25 ఏళ్ల కిందట సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చాను.
 
తగిన పాత్రలలో నటించి మెప్పించాను. తద్వారా వచ్చిన డబ్బుతో జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో ఇల్లు కట్టాను. నాతోపాటు మా అమ్మ నా అక్కయ్య వుండేవారు. మా అక్కకి పెళ్లి చేసాను. ఆ తర్వాత కుదురుకున్నాక వివాహం చేసుకుందామని అనుకున్నాను. ఈలోపు నా సోదరి, ఆమె పిల్లలు వచ్చారు. వారి అల్లుళ్లు కూడా వచ్చేసారు. ఇటీవలే మా అమ్మ చనిపోయారు. ఇక అక్కడ్నుంచి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ నన్ను వేధిస్తున్నారు. ఇంటిని మా అమ్మ పేరుపై రిజిస్టర్ చేయించాను.
 
ఆ సాకుతో ఆ ఇల్లు మొత్తం మాది అంటున్నారు. నాపై దాడి చేసి రోడ్డుపైకి నెట్టేసారు. నన్ను చంపరట, నేరుగా ఎర్రగడ్డ నుంచి ఆంబులెన్స్ పిలిపించి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపిస్తారట. వాళ్లు 10 మందికి పైగా వున్నారు. నేను ఒంటరిదాన్ని. నన్ను ఏమైనా చేయగలరు. నాకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషను, మానవ హక్కుల సంఘానికి విన్నవించుకుంటున్నాను. మీడియావారి ద్వారా నా బాధను వ్యక్తం చేస్తున్నాను అంటూ చెప్పారు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026ను లాంచ్ చేసిన కాగ్నిజెంట్