గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జనవరి 2026 (19:20 IST)

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

Sajjanar
మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం ఏమాత్రం సరికాదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. అలాగే మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలని అన్నారు. మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు ఆందోళనకరమన్నారు.
 
'ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వం. మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కాదు. వ్యక్తిత్వంపై దాడి అంటే వారి పురోగతిపై దాడి చేసినట్టే. స్త్రీలను గౌరవించని సమాజం భవిష్యత్తు దెబ్బతింటుంది. భవిష్యత్తు అంతా మహిళలదే' అని సజ్జనార్ అన్నారు. 
 
ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, మీడియా ద్వారా మహిళల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను ఖండించాలని ఆయన కోరారు. 
 
మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వమని మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏ మాత్రం అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. మహిలను గౌరవివించని సమాజం భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. భవిష్యత్ అంతా మహిళలదే అని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.