ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్
తెలంగాణలో మహిళలకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఐతే దీని గురించి రోజుకో వింత సంఘటనలు కనబడుతున్నాయి. ఒకచోట మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని సీట్ల కోసం కొట్లాడుతుంటే తాజాగా ఓ మహిళ ఏకంగా సీట్లో కూర్చుని కదులుతున్న బస్సులో దర్జాగా పళ్లు తోముతూ కనిపించింది. తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆమె ఎంతమాత్రం పట్టించుకోలేదు. వీడియో తీస్తున్నవారిని... తీయ్, తీసి పెట్టు. పొద్దున్నే ఊరెళ్లాల. బస్సు నాకోసం ఆగదు కదా. పళ్లు తోముకోలేదు. పళ్లు తోముకునే దాకా బస్సు 10 నిమిషాలు ఆపుతారా, కిందకెళ్లి దిగి తోముకుని వస్తా అంటూ సెటైర్లు వేసింది.
నాగర్ కర్నూలు జిల్లాలో పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసి బస్సులో మహిళ ఇలా బ్రష్ చేస్తూ కనిపించింది. ప్రయాణంలో ఇలా బ్రష్ చేస్తున్న మహిళను చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.