బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు, చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఏపీలో వనజంగి, అరకు లోయ, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది.