1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. What is this one-sided love of Pawan Kalyan-s for Telangana?, Kalvakuntla Kavitha

మాకు వద్దు మొర్రో అంటుంటే పవన్ కల్యాణ్ గారి ఈ ఒన్ సైడ్ లవ్వేంటో? కల్వకుంట్ల కవిత

K Kavitha press meet
తెలంగాణలో పరిస్థితి ఒకింత విడ్డూరంగానే అనిపిస్తుంటుంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు వుండవచ్చు. వారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడవచ్చు. కానీ తెలంగాణలో ఆంధ్ర రాజకీయ నాయకులు మాత్రం అడుగుపెట్టకూడదు. ఇదే కొంతమంది చేస్తున్న వాదన. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ బరాబర్ మా జాగీరే. పవన్ కల్యాణ్ గారి తాత ముత్తాతలది ఏ రాష్ట్రం. ఆయనకు తెలంగాణాలో ఏం పని. మాకు వద్దు మొర్రో అంటుంటే ఈ ఒన్ సైడ్ లవ్వేంట్ర బాబు. మా తెలంగాణలో ఇక్కడి రాజకీయ పార్టీలే పోటీ చేస్తాయి, ఇక్కడి వారే గెలుస్తారు అని చెప్పారు.
 
మరి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ అయి దేశంలో వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా ప్రారంభించిన సంగతి గురించి ఏం చెబుతారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. అంతేకాదు... అటు తమిళనాడులో సైతం తెలుగువారు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగానూ ఎంపికవుతున్నారు. అలాగే కర్నాటకలోనూ తెలుగువారికి ప్రాతినిధ్యం వున్నది. ఆ ప్రకారంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయవచ్చు, అలాగే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అలా పోటీ చేసేవారిని ప్రశ్నించే హక్కు లేదు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి తెలంగాణలో దీనికి భిన్నంగా పరిస్థితులు వున్నాయా?

About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
డ్రోన్ దాడులు జరిగితే ఏంటి? షెడ్యూల్ ప్రకారం పని ముగించిన నారా లోకేష్