1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. When I demanded the arrest of Bandi Bhagirath, the police made me sit in the station, says Bakka Judson

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

Bakka Judson
పోక్సో కేసులో వున్న బండి భగీరథ్ ను అరెస్ట్ చేయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు అడిగేందుకు వెళితే తననే పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రని బక్క జడ్సన్ సెల్ఫీ వీడియోలో వివరించారు. ఆయన ఆ సెల్ఫీలో మాట్లాడుతూ... బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కంటే నేనేమైనా పెద్ద నేరస్థుడినా. నన్ను ఎందుకు పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. నాకు కనీసం టీ కూడా ఇవ్వలేదు. స్వయంగా బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎందుకు పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేయడంలేదంటూ ప్రశ్నించారు.
 
బండి భగీరథ్ కంటే నేనే నేరస్థుడని పోలీసులు భావిస్తే తనను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా అడిగివారిని అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు జడ్సన్.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
దేశవ్యాప్తంగా దేశీయ విద్యా రుణాలను విస్తరిస్తోన్న ఆక్సిలో