సంబంధిత వార్తలు
- Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
- నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన
- సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)
- జనసేన విప్ పదవికి రాజీనామా చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే
- ఈ కట్టె కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్ : నటుడు తనీష్ ఎమోషనల్ ట్వీట్
జనసేన తెలంగాణ ఇండోర్ సమావేశంపై ఎందుకు అంత జంకు?
జనసేన తెలంగాణ ఆవిర్భావ నవ నిర్మాణ సభకు అనుమతి రాకపోవడంపై తెలంగాణ జనసేన నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తెలంగాణవాదులమంటూ జనసేనపై లేనిపోని అభాండాలు వేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన నిర్వహించనున్న సభ 2000 మంది ప్రతినిధులతో ఇండోర్ ఏరియాలో జరగనుంది. ఆ సభపై కూడా కొంతమందికి ఎందుకు అంత ఉలికిపడుతున్నారంటూ విమర్శిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ జనసేన దీనిపై స్పందిస్తూ... రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుకుని ఎన్నో రాజకీయ పార్టీలు రేపు సభలు నిర్వహించుకుంటారు, వారందరికీ లేని అడ్డంకులు జనసేన పార్టీకి సృష్టించడం శోచనీయం. తెలంగాణ ఆట, పాట, సంస్కృతిని అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ పోరాట స్పూర్తి తనకు ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడానికి ప్రేరణ అని ఆయనే స్వయంగా చెప్పారు.
తనని ఆదరించిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విస్తరణకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినంగా భావించి తలపెట్టిన సభ "తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ." ఇలాంటి సభకి అనుమతి నిరాకరించడం విచారకరం అని పేర్కొంది.
