1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Woman dies after falling from sixth-floor of apartment in Miyapur; infant daughter survives

ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన తల్లి (వీడియో)

esha saahu
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో గుండెలవిసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూరి నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఈషా సాహు (37) అనే మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి దూకేసింది. ఈ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. కుటుంబ కలహాలో, భార్యాభర్తల మధ్య గొడవో ఏంటే తెలియదుగానీ, తన ముక్కుపచ్చలారని ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. 
 
ఈ ఘోర ప్రమాదంలో ఈషా సాహు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరు నెలల చిన్నారి మాత్రం అదృష్టవశాత్తు చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కింద ఉన్న ఫెన్సింగ్ తలకు బలంగా తగలడం వల్లే ఆ పరిప్రామం నిలిచినట్టు తెలుస్తోంది. అయితే, ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అధికార అహంకారానికి 2024 ఎన్నికల తీర్పు ఒక చారిత్రాత్మక పాఠం.. పవన్