సంబంధిత వార్తలు
- భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే .. ఎస్ఐ నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు..
- ఓయ్ ఫ్రెండ్సూ... జాబ్ వేకన్సీరా బాబూ, నెలకి రూ. 12 వేలు, మదనపల్లి మహిళా రైతు ఆఫర్, వీడియో
- టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు
- మొబైల్ వినియోగదారుల కోసం జియోటీవీ ప్రో ప్యాక్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను అందుబాటులోకి...
- విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో
టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని సామూహిక అత్యాచారం
హైదరాబాదులో ఘోరం జరిగింది. ఒక ప్రముఖ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ నమ్మబలికిన ఇద్దరు కామాంధులు ఓ మహిళపై దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ క్రూర ఉదంతానికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 సంవత్సరాల బాధితురాలికి, ఆమె భర్తకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల గొడవలు నడుస్తున్నాయి.
దీంతో గత రెండేళ్లుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటూ, ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆశతో, సమస్యలను తీర్చే ఒక టెలివిజన్ షోలో పాల్గొనడం కోసం ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సదరు మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తనకు టీవీ షో నిర్వాహకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఆమెకు షోలో అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా, కాసేపటికి అతని స్నేహితుడు కూడా అక్కడికి చేరుకుని ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
ఆ తర్వాత బాధితురాలు నేరుగా సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, తనకు జరిగిన ఘోరాన్ని వివరించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
