సంబంధిత వార్తలు
- Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
- పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్
- తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
- స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం
- KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు
పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ అనే పేరును ఉపయోగించుకుంటూ ముష్టి ఎత్తుకోకపోతే కొందరికి ముద్ద దొరకదు, పాపులారిటీ రాదంటూ సినీ నటి మాధవీలత షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఇటీవల తెలంగాణలో పవన్ కల్యాణ్ పట్ల జరుగుతున్న వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె మాటల్లోనే... గత కొన్నిరోజులుగా తెలంగాణలో పవన్ కల్యాణ్ గారి పట్ల జరుగుతున్న వ్యవహారంపై మాట్లాడకుండా వుండలేకపోతున్నాను. కొంతమంది పనికిమాలిన వెధవలు తెలంగాణ పరువు తీస్తున్నారు. నేను కేవలం పెయిడ్ జర్నలిస్టులు గురించి మాట్లాడుతున్నా. నా స్నేహితులు తెలంగాణ కోసం పోరాటం చేసారు. తెలంగాణ వచ్చింది.
తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అంటారెందుకు? భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకవచ్చని తెలీదా, అరే మీకసలు రాజ్యాంగం తెలుసా? తెలంగాణ గురించి పల్లెత్తు మాట అనని, తెలంగాణ ప్రజలకు సాయం చేసోటోడిని పట్టుకుని చంపేస్తామంటారా? పవన్ కల్యాణ్ తెలంగాణలో అడుగుపెడితే చంపేస్తారా? ఇది మీ అబ్బ జాగీరా... ఎవరు ఎక్కడికైనా వెళ్లి బ్రతకవచ్చని తెలీదా... మరి తెలుగోళ్లు అమెరికా వెళ్లి బ్రతుకుతున్నారు వారిని కూడా మీరన్నట్లే చేస్తారా? ఏం బతుకులురా మీవి. తెలంగాణానకు ఈ గబ్బు నాకొడుకులు ఇజ్జత్ తీస్తున్నారని బాధపడుతున్నారు. పవన్ కల్యాణ్ పేరును ముష్టెత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు. సాయం చేసే పవన్ కల్యాణ్‌ను ఎవరైనా ఎలా అంటారో... మీరు సూటిగా మాట్లాడుతున్నారు మేడమ్ అంటూ కితాబిస్తున్నారు.
