మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2026 (19:51 IST)

యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి ప్రియుడు అఖిల్, వీడియో వైరల్

Komali
యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ముందు తన మాజీ ప్రేమికుడికి ఫోన్ చేసి రమ్మన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోమలి తన ప్రియుడు అఖిల్ రెడ్డితో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది. ఐతే అప్పటి నుంచి కోమలి మణికొండలోని చిత్రపురి కాలనీలో వుంటోంది. అఖిల్ రెడ్డిని వదిలి వుండలేని కోమలి ఆత్మహత్యకు ముందు అతడిని ఇంటికి పిలిచింది. తనతో కలిసి వుండాలని అతడిని కోరగా అందుకు అఖిల్ రెడ్డి నిరాకరించినట్లు సమాచారం. దీనితో తీవ్ర మనస్థాపం చెందిన కోమలి ఇంట్లోనే చీరతో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
 
విశాఖపట్టణంకు చెందిన కోమలి, మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నది. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.