బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 13 జులై 2014 (13:29 IST)

హైదరాబాద్‌ నగర శివార్లలో రేవ్ పార్టీలు : 12 గర్ల్స్ అరెస్టు

హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు... బడాబాబుల పుత్రరత్నాలు నగర శివార్లలో వాలిపోతున్నారు. రాత్రంతా మజానే మజా. ఈ నేపథ్యంలో గత రాత్రి నగర శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఓ రిసార్ట్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఆశ్లీల నృత్యాలు చేస్తున్న 12 మంది యువతులతో పాటు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అరెస్ట్ అయిన వారంతా బడాబాబుల కుమారులే అని తెలుస్తోంది. అయితే, అరెస్ట్ అయిన వారిని మాత్రం పోలీసులు ఇంతవరకు మీడియాకు చూపించలేదు. అరెస్ట్ అయిన వారిని వదిలేయాలని హై లెవెల్ నుంచి పోలీసులకు ఫోన్లు వస్తున్నట్టు సమాచారం. నృత్యాలు చేయడానికి వచ్చిన అమ్మాయిల్లో కొంత మంది బెంగళూరు నుంచి వచ్చారు. వీరిని ఓ బ్రోకర్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సమాచారం.