శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (10:39 IST)

వైఫై సేవలతో అదిరిపోనున్న హైటెక్ సిటీ హైదరాబాద్!

హైదరాబాద్ నగరంలో 4జీ ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఐటీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు దశల్లో రూ.4,100 కోట్లతో 4జీ సేవలను అందించాలని నిర్ణయించారు. నగరం చుట్టు పక్కల వైఫై సేవలతో హైఫై నగరంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. 
 
మొత్తం 6 కార్పొరేషన్లలో 4జీ సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. 4జీ సేవలను విస్తరించి సెప్టెంబర్ నెలఖారులోగా అందుబాటులోకి తీసుకునిరావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 37 మున్సిపాలిటీలు, 220 మండల కేంద్రాల్లో 4జీ సేవలు ఇవ్వాలని అన్నారు. నగరంలో వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్ నెలాఖరునాటికి హైదరాబాద్‌ను 4జీ వైఫై నగరంగా మార్చాలని తెలిపారు.