రాష్ట్రానికి ప్రేమతో... యాపిల్! నాన్నకు ప్రేమతో... పాలేరు! కేటీఆర్ కానుక!
హైదరాబాద్: తెలంగాణా సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ చెబుతానన్న బిగ్ న్యూస్ ఇదే. రాష్ట్రానికి యాపిల్ కానుకగా తెచ్చా... నాన్నకు పాలేరు కానుకగా ఇచ్చా... అదే నేను చెపుతానన్న పెద్ద వార్త అంటున్నారాయన. కేటీఆర్ ట్విట్టర్ పిట్ట కొద్దిసేపటి క్రి
హైదరాబాద్: తెలంగాణా సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ చెబుతానన్న బిగ్ న్యూస్ ఇదే. రాష్ట్రానికి యాపిల్ కానుకగా తెచ్చా... నాన్నకు పాలేరు కానుకగా ఇచ్చా... అదే నేను చెపుతానన్న పెద్ద వార్త అంటున్నారాయన. కేటీఆర్ ట్విట్టర్ పిట్ట కొద్దిసేపటి క్రితం కూసింది. రెండు రోజుల క్రితం కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ‘ఎల్లుండి ఓ పెద్దవార్త మీతో పంచుకుంటాను.. అప్పటివరకు సస్పెన్స్’ అని పేర్కొన్న విషయం తెలిసిందే.
కేటీఆర్ ట్వీట్ పైన అందరూ ఊహించిందే నిజమైంది. హైదరాబాద్‌లోని వేవ్‌రాక్ భవనంలో యాపిల్ సీఈవోతో కేటీఆర్ భేటీలో పాల్గొంటుండగానే, కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ స్పందించారు. ‘బిగ్ న్యూస్: యూఎస్ వెలుపల యాపిల్ లార్జెస్ట్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది’ అంటూ పోస్ట్ చేశారు. యాపిల్ భవనం ఓపెనింగ్ సందర్భంగా యాపిల్ సీఈవో, సీఎం కేసీఆర్, అక్కడి యువతతో దిగిన సెల్ఫీలను కేటీఆర్ పోస్ట్ చేశారు. అంతేకాదు, పాలేరులో టీఆర్ ఎస్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిందని...ఇది నాన్నకు ప్రేమతో...అంటున్నారు కేటీఆర్.