న్యూ జనరేషన్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం మనీ. సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం సన్నివేశాల పరంగాను, సంగీత పరంగాను, చిత్రీకరణ పరంగానూ, పాత్రల రూపకల్పన పరంగాను కొత్త పుంతలు తొక్కింది. తాజాగా 'మనీ'కి పార్ట్ త్రీ రాబోతోంది. 'మనీ మనీ మోర్ మనీ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియ శిష్యుడైన జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. 'ఖాన్‌దాదా'గా బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. 'అనంతరంపురం', 'సర్వం' వంటి అనువాద చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాథ్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.