'నాయక్' 50 రోజులు పండుగ... దానయ్యపై నాగబాబు ఫైర్

Nayak 50 days
Venkateswara Rao. I| Last Modified గురువారం, 28 ఫిబ్రవరి 2013 (16:24 IST)
WD
బెంగళూరులో 'నాయక్' 50 రోజులు పండుగ సందర్భంలో చిత్ర నిర్మాత దానయ్యపై చిరంజీవి సోదరుడు, రామ్ చరణ్ బాబాయి నాగబాబు ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏంటయా అంటే, నాయక్ చిత్రం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుని ముందుకు వెళుతున్న సందర్భంగా బెంగళూరులో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత డీవీవి దానయ్య, కర్నాటక డిస్ట్రిబ్యూటర్ జ్ఞానేశ్వర్ డుమ్మా కొట్టారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ... ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు కూడా రాకపోడం చూస్తుంటే వాళ్ల బిజినెస్ మైండ్ ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు.

కాగా రామ్ చరణ్ 'నాయక్' సినిమా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 55 థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలా పాల్ నటించారు.


దీనిపై మరింత చదవండి :