మిర్చి అనుష్క: ప్రేమ దానంతట అదే రావాలి.. ప్రేమలో పడితే ఓపెన్‌గా చెప్పేస్తా!

SELVI.M|
FILE
మిర్చి ఇంకా ప్రేమలో పడలేదట. ప్రేమ అనేది దానంతట అదే రావాలని చెబుతోంది. తానింకా ప్రేమలో పడలేదని, అలా ప్రేమలో పడితే తప్పకుండా ఓపెన్‌గా చెప్పేస్తానని చెబుతోంది.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న అనుష్క సినీ కెరీర్‌కు అరుంధతి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సినిమాలతో బిజీ బిజీగా ఉన్న అనుష్క ప్రేమికుల రోజు సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.

ప్రేమ అనేది దానంతట అదే రావాలని, ఎవ్వరి బలవంతంతో రాదని ప్రేమకు నిర్వచనం చెప్పింది. ఇప్పటివరకు ప్రేమలో పడలేదని, అలా ప్రేమిస్తే తప్పకుండా అందరికీ చెప్తానంది.

కాగా.. ప్రస్తుతం రుద్రమదేవి సినిమాలో అనుష్క నటిస్తోంది. డైరక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్జ్ అయిన ఈ సినిమాలో అనుష్క క్యాస్టూమ్, క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమా కోసం కత్తిసాము యుద్ధం నేర్చుకుంటున్నానని తెలిపింది.


దీనిపై మరింత చదవండి :