స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాక ఇమేజ్‌ను కాపాడుకోవడం చాలా కష్టమైన పని. ఆదితో మాస్ ఇమేజ్‌ను పెంచుకుని సింహాద్రి చిత్రంలో ఇంకాస్త పీక్ స్టేజీకి వెళ్లిన ఎన్‌టిఆర్ జూనియర్‌కు.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మిశ్రమ స్పందన కల్గించాయి. అదుర్స్ ఆడినా ఆ తర్వాత అంతగా ఆడిన సినిమాలు లేవు. ప్రస్తుతం తన కెరీర్‌ను సినిమాల వైపే చూసుకుంటున్నాడు.