రిలయన్స్‌ను చూసి నేర్చుకున్నా... అక్కినేని నాగార్జున

Venkateswara Rao. I| Last Modified సోమవారం, 28 అక్టోబరు 2013 (20:48 IST)
WD
హీరోగా నటిస్తూనే... నిర్మాతగానే పలు చిత్రాలు తీయడానికి నిర్ణయించుకున్నాడు. ఇటీవలే 'భాయ్‌' చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడుతూ... రియలన్స్‌ వంటి సంస్థ రావడంతో సినిమా ఎలా తీయాలనేది.. కొన్ని వ్యాపారానికి సంబంధించిన రూల్స్‌ తెలుసుకున్నాననీ, ముందుముందు వారితో మరిన్ని సినిమాలు తీయడానికి ఇది మార్గమయింది అన్నారు.

ప్రస్తుతం ఆయన చిన్న చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. 'గోల్కొండ హైస్కూల్‌' నిర్మించిన రామ్మోహన్‌తో తాజాగా 'ఉయ్యాల జంపాల' వంటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు సమర్పకుడు. అష్టాచెమ్మ తరహా ప్రేమకథతో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తీశారు.

ఇటీవలే ట్రైలర్స్‌ విడుదలయ్యాయి. విరించి వర్మ దర్శకుడు. టీవీ సీరియల్స్‌లో నటించిన అరుణ్‌, ఆనందిని జంటగా నటిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. బేనర్‌ మాత్రం నాగ్‌ కార్పొరేషన్‌పై నిర్మిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :