కిక్ సినిమా తర్వాత క్రేజీ హీరో రవితేజ శంభో శివ శంభో అంటూ తెరపైకి రానున్నారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ నిర్మిస్తున్న శంభో శివ శంభో చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమిళంలో అనంతపురం 1980 ఫేమ్ శశికుమార్ హీరోగా నటించిన నాడోడిగళ్ అనే చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న శంభో శివ శంభో చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్, శివబాలాజీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.