డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ, సోనియా, ఆర్తీ అగర్వాల్, కల్యాణి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి జూబ్లిహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది.ఈ కార్యక్రమంలో మాడుగుల నాగఫణిశర్మ, దైవజ్ఞశర్మ, అల్లరి నరేష్, వేణు మాధవ్, గీత రచయిత భాస్కరభట్ల రవి, సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ, సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్, హీరో రామ్, అనుష్క, భూమిక దంపతులు, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. ముందుగా చిత్రంలోని ఒక్కోపాటను ఒక్కో అతిథి విడుదల చేశారు. అనంతరం సీడీని హీరో రామ్ ఆవిష్కరించి భూమిక, అనుష్కలకు సీడీని అందించారు.