మారుతీ ఆర్ట్ ఫిల్మ్స్ స్వామి సత్యానంద చిత్రం హాస్య సన్నివేశాలను ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గౌతం రాజు, చిత్రం శ్రీను, కవిత మల్లేష్ యాదవ్‌లపై ఇటీవల చిత్రీకరించగా, నిజాంపేట్‌లోని జామతోటలో విలన్‌పై కొని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. జి.వి.హెచ్.ప్రసాద్ రచించగా రఘు కుంచె గానం చేసిన అందమైన హై టెక్క్ సిటీ... ఆల్ ఇండియా మెచ్చిన సిటీ... అమెరికాకు నచ్చిన సిటీ.. అందరి సిటీ... ఆశల సిటీ.. అద్భుత సిటీ..., ఆఖరి పాట హైదరాబాద్‌లోని కొన్ని ముఖ్య ప్రదేశాల నేపధ్యంలో చిత్రీకరించారు.10వ తేదీ నుండి 15 తేదీ లోగా బెంగళూరులోని ఆశ్రమంలో పాట సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తదుపరి చిత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ నిర్మాత జి.వి.హెచ్.ప్రసాద్ తెలియజేసారు.