గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (12:04 IST)

ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్ పుట్- ధోనీ భార్యగా అలియా భట్!

బాలీవుడ్‌లో క్రీడాకారుల బయోగ్రఫీ సినిమాలుగా వచ్చేస్తున్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితకథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నీరజ్ పాండే రూపొందిస్తున్న ఈ బాలీవుడ్ సినిమాలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటిస్తున్నాడు. క్రికెటర్ సురేష్ రైనా పాత్రను టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పోషిస్తాడంటూ వార్తలొస్తున్నాయి. 
 
కాగా, ధోనీ భార్య సాక్షి సింగ్ పాత్రను బాలీవుడ్ భామ అలియా భట్ పోషిస్తుందని తాజా సమాచారం. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి