గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2015 (20:14 IST)

అలాంటి సినిమాల్లో నటించాలనే చేశా: అల్లు అర్జున్‌

మామూలు సినిమాల్లో నటించడం వేరు. కానీ 'రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించడం గొప్ప అదృష్టం. ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేవనీ, ఆ సినిమాల ద్వారా తెలుగు సినిమా మార్కెట్‌ పెరుగనుందని ఆయన తెలిపారు. అలాంటి ఒక సినిమాలో తానో పాత్ర చేయడం ద్వారా దానికి మరింత ఆకర్షణ తోడవుతుందనే ఆ సినిమాలో నటించానని స్పష్టం చేశారు. 
 
రుద్రమదేవిలో తాను చేసిన గోనగన్నారెడ్డి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసున్నాక చేయాలనిపించిందన్నారు. కాగా, బోయపాటి శ్రీనుతో ప్రస్తుతం ఓ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అది కొలిక్కిరాగానే ప్రకటన విడుదల చేస్తానని బన్నీ తెలిపారు.