శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (16:50 IST)

సికిందర్‌లో రజనీ కాంత్ భాషా ఛాయలు: సూర్య హ్యాపీ!

లేటెస్ట్‌గా సూర్య నటించిన సికిందర్‌ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాకు ఈనెల 15న విడుదల చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పూర్తి మాఫియా నేపథ్యంలోసాగే కథాంశంగా కన్పిస్తుంది.
 
రెండు షేడ్స్‌లో సూర్య కన్పించనున్నారు. ఈ చిత్రం ఓపెనింగ్స్‌ బాగుంటాయని, బెల్లంకొండ శీను సినిమా కూడా కలెక్షన్లు తప్పుతాయని రభస సినిమా కూడా వాయిదా వేయించాడు ప్రముఖ నిర్మాత. అయితే సూర్య చిత్రానికి అలా చేయడం కుదరలేదు. 
 
ట్రైలర్స్‌లో సూర్య షేడ్స్‌ అచ్చం రజనీకాంత్‌ భాషా ఛాయలుగా వున్నాయని తెలుస్తోంది. కానీ ఆ చిత్రానికి దీనికి పోలికలు వుండవు. కొన్ని షేడ్స్‌ కలుస్తాయని తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్‌ చెబుతున్నారు.  
 
తమిళంలో లింగుస్వామి పనితీరు నచ్చి ఆయనతో అసోసియేట్‌ అయినందుకు ఆనందంగా ఉందంటున్న నిర్మాత.. వచ్చే ఏడాది ఆయనతో మరో చిత్రం నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ భాషా ఛాయలున్నా పర్లేదని తన సినిమా హిట్ అవుతుందని సూర్య హ్యాపీగా ఉన్నారు.