బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (16:58 IST)

హాలీవుడ్‌కు అనుష్క, నయనతార?

సినిమాల్లో ఆడిషన్‌ కోసం రకరకాలుగా హీరోయిన్ల కోసం చేస్తుంటారు. అయితే దక్షిణాది సినిమాల్లో చేయడం మామూలే. కానీ హాలీవుడ్‌ సినిమాలో దక్షిణాది అమ్మాయికోసం వెతకడానికి హాలీవుడ్‌ సంస్థ ముందుకు వస్తుంది. 
 
హాలీవుడ్‌లో 'ఎక్స్‌పెండబుల్స్‌' సినిమా తెలిసే వుంటుంది. ఇప్పటికే రెండు భాగాలు వచ్చి హిట్‌ అయింది. ముచ్చటగా మూడో పార్ట్‌కోసం ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈసారి ఇండియాకు చెందిన అమ్మాయిని ఓ పాత్రకోసం వేట మొదలుపెట్టారు.
 
త్వరలో ముంబై, చెన్నైకు టీమ్‌ రానుంది. ముంబైలో ఆ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా అమ్మా యిలున్నా.. దక్షిణాదిలో కొత్తగా వుంటుందని ఆలోచనకూడా వారికి వుంది. ఈనెల సెండర్‌వీక్‌లో టీమ్‌ చెన్నై వస్తుంది. ఇందుకోసం ప్రముఖ హీరోయిన్లు పేర్లు విన్పిస్తుంది. వారిలో అనుష్క, నయనతార పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.