గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 21 జూన్ 2014 (16:37 IST)

రామ్ చరణ్ 'తాత' రాజ్‌ కిరణ్‌కు దాసరి కితాబు!

రాజ్‌కిరణ్‌.. ఈయన తమిళ నటుడు... అక్కడ పెద్ద ఏక్టర్‌. ఈ పేరు వినగానే కృష్ణవంశీ, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తయారువున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలె' గుర్తుకువస్తుంది. అందులో కొద్దిరోజులు రామ్‌చరణ్‌కు తాతగా నటించాడు. చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఆయన సరిగ్గా చేయడం లేదని ప్రకాష్‌రాజ్‌ను ఆ స్థానంలో పెట్టేశారు. కానీ.. తమిళనాడు ఆయన నటించిన 'మంజాపై' చిత్రం పెద్ద పేరు తెచ్చింది. అది ఒకప్పటి దాసరి 'తాత మనవడు' చిత్రం లాంటిది. 
 
తాతగా రాజ్‌కిరణ్‌, మనవడుగా కమల్‌ నటించారు. తొలివారంలోనే ఐదు కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ నిర్మించారు. మంచి రన్నింగ్‌లో ఉన్న ఈ చిత్రంపై దాసరి కన్ను పడింది. పెద్ద పోటీ ఉన్నా దాసరి ఆ చిత్ర రైట్స్‌ తీసుకుని తన సౌభాగ్య మీడియాపై రీమేక్‌కు ప్లాన్‌ చేస్తున్నాడు. తాతగా రాజ్‌ కిరణ్‌ అద్భుతంగా నటించాడనీ, నేను చేసినప్పుడు ఎస్వీరంగారావు ఆ పాత్రను చేసిన సంగతులు గుర్తుకు వచ్చాయని చెబుతున్నారు. మరి తెలుగులో ఎవరిని పెడతారో చూడాలి.