బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
Written By Ganesh
Last Updated : సోమవారం, 2 జూన్ 2014 (17:28 IST)

అక్కినేని అఖిల్‌పై కామెంట్ చేసిన సూపర్‌స్టార్ మహేష్!

అక్కినేని అఖిల్‌పై సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. మనం సినిమాలో అఖిల్ క్లైమాక్స్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు అటు ప్రేక్షకులను నుంచి ఇటు స్టార్లనుంచి అఖిల్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటీవల అఖిల్‌కు రామ్ చరణ్ కాంప్లిమెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఇప్పుడు మరో స్టార్ మహేష్ బాబు కూడా అఖిల్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. "మనం సినిమాలో అఖిల్ కనిపించడం చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఈ కుర్రాడు భవిష్యత్తులో మంచి స్టార్‌గా ఎదుగుతాడు'' అంటూ మహేష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ సినిమా తనకు బాగా నచ్చినట్టు చెప్పాడు. "మనం చూస్తుంటే అక్కినేని సజీవంగానే వున్నట్టు వుంది. ఈ చిత్రాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్ర యూనిట్‌కు నా అభినందనలు అని మహేష్ తెలిపాడు.