గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (13:28 IST)

జూనియర్ ఎన్టీఆర్ తండ్రైయ్య్యాడోచ్: పండగే పండగ!

నందమూరి ఇంట మరో వారసుడు జన్మించాడు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయ్యారు. జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పండండి మగబిడ్డ జన్మించాడు. మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్ష్మీ ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చారు.
 
జూనియర్‌కు మరో జూనియర్ జన్మించడంతో నందమూరి, నార్నే కుటుంబాల్లో సందడి నెలకొంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి వెళ్లి తమ వారసుడిని చూశారు. ఈ సందర్భంగా హరికృష్ణ ఫోన్లు చేస్తూ పలువురితో తన ఆనందాన్ని పంచుకున్నారు.
 
ఇదిలా ఉంటే అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలకు కూడా మగశిశువు జన్మించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తనయుడి ఫస్ట్ లుక్ ఫోటోలను బన్నీ విడుదల చేసిన సంగతి విదితమే.