మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (18:04 IST)

పీఎం నరేంద్ర మోడీ స్వదేశీ ప్రచారానికి రాజమౌళి మద్దతు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ ప్రచారానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మద్దతు ప్రకటించారు. నిజానికి చైనా వస్తువులు భారత్‌ను ముంచెత్తుతున్నాయని, దీంతో, చైనీయులు లాభపడుతున్నారని ప్రధాని మోడీ భావిస్తున్నారు. తత్ఫలితంగా భారతీయ వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారని, ఈ పరిస్థితిని అరికట్టాలని మోడీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. భారతీయులంతా స్వదేశీ తయారీ వస్తువులనే కొనాలని, స్థానిక తయారీదారులను ప్రోత్సహించి, భారత ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని ప్రధాని పిలుపునిచ్చారు. 
 
ఈ పిలుపుపై రాజమౌళి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 'స్వదేశీ' ప్రచారానికి మద్దతు పలికారు. ఈ మేరకు మోడీ సందేశాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 'స్ప్రెడ్ ద వర్డ్' పేరిట ఈ దర్శకధీరుడు చేసిన షేర్‌కు లైక్స్ వెల్లువెత్తాయి. వాస్తవానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సినిమా విషయాల కంటే, సామాజిక అంశాలపైనే రాజమౌళి ఎక్కువగా స్పందిస్తుంటారు.