బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : సోమవారం, 30 జూన్ 2014 (10:13 IST)

వెంకటేష్- మహేష్ "ఆనందం ఆనందమే"!

"ఆనందం ఆనందమే" అనే టైటిల్‌తో మహేష్, వెంకీ మరో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారా అని అనుకోకండి. ఇదివరకే ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాను తమిళంలో డబ్బింగ్ చేసి "ఆనందం ఆనందమే" అన్న టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ తమిళ వెర్షన్ ను జూలై రెండో వారంలో తమిళ నాట విడుదల చేస్తున్నారు.

తమిళ ప్రేక్షకులకు సుపరిచయులైన అంజలి, సమంత ఇందులో వుండడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుంది. విజ్జీ క్రియేషన్స్ బ్యానర్ పై కె. రామాంజనేయులు దీనిని తమిళంలోకి అనువదించి విడుదల చేస్తున్నారు.