రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సూపర్‌హిట్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ 'దేవుడు చేసిన మనుషులు' అనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ - ''జగన్ కాంబినేషన్‌లో చేస్తున్న 5వ చిత్రం ఇది. మా కాంబినేషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. మా బి.వి.ఎస్. ఎన్.ప్రసాద్‌గారి బేనర్‌లో ఈ సినిమా చెయ్యడం హ్యాపీ'' అన్నారు.