అమ్మో... బ్రెస్ట్ కేన్సర్: టాలీవుడ్ హీరోయిన్స్

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
తారలకు ఇప్పుడు కొత్తభయాలు పట్టుకున్నాయి. కెరీర్‌గ్రాఫ్‌, సంపాదన, వైవాహిక జీవితంఎలా ఉంటుంది అనే వాటికంటే వారికి వేరే కొత్త భయం ఎక్కువయింది. అదే ఆరగ్యోంపై భయం. గ్లామర్‌, హెల్త్‌ కాన్షస్‌ విపరీతంగా పెరిగిపోవడంతో తారలు తమ ఆరోగ్యం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. దీనికోసం వేలాదిరూపాయలు ఖర్చుపెడుతున్నారు.

టాలీవుడ్‌లో పలు షూటింగ్‌ స్పాట్లకు ఆయా దర్శకుల వ్యక్తిగత వైద్యులు వస్తుండటం మామూలై పోయింది. అదే బాటను ఇప్పుడు హీరోయిన్లు అనుసరిస్తున్నారు. హీరోయిన్లను ప్రధానంగా వెంటాడుతున్న భయం బ్రెస్ట్‌ కేన్సర్‌. వివరాలలోకి వెళితే... సంజయ్‌దత్‌ తల్లి నర్గీస్‌ కేన్సర్‌తో మరణించింది. ఇటీవలే గౌతమి బ్రెస్ట్‌కాన్సర్‌తో బాధపడింది. కమల్‌హాసన్‌ దగ్గరుండి ఆదుకోవడంతో కోలుకుంది.

అదేవిధంగా హృతిక్‌రోషన్‌ చెల్లెలు సునయనకు గర్భాశయ కేన్సర్‌ వచ్చిందనీ, ప్రియాంక చోప్రా తండ్రికి లివక్‌ కేన్సర్‌ వచ్చిందనీ, ఐశ్వర్యారాయ్ తండ్రి కృష్ణరాజ్‌కి కేన్సర్‌ ఉందనే వార్తలు రావడం.. అవి ఏలాగో హీరోయిన్లు వినడంతో తమ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇండిస్ట్రీలో ఎక్కువగా తారలు, దర్శకుల ఆరోగ్యాన్ని అపోలో, యశోధా సూపర్‌ స్పెషాలిటీలో పనిచేసే డాక్టర్లు పర్యవేక్షిస్తుంటారు.

తాజాగా ప్రముఖ హీరోయిన్‌ అపోలో ఆస్పిత్రిలో ప్రత్యక్షమైంది. మొదట్లో ఎవరినో పలకరించడానికివచ్చిందనకున్నారు. కానీ ఆ హీరోయిన్‌ తనకున్న భయాన్ని వ్యక్తం చేసిదంట.. మీరు భయపడాల్సిన పనిలేదనీ, బ్రెస్ట్‌కు సంబంధించిన వ్యాధి ఏదీ మీకు రాదనీ చెప్పడంతో రిలాక్స్‌గా ఇంటికెళ్లిందట.


దీనిపై మరింత చదవండి :