అలాంటి ఛాన్స్ అందరికీ రాదుగా..!: అసిన్
నటనకు ఆస్కారం ఉందా? లేదా? అనే విషయం గురించి అంతగా పట్టించుకోనని గజిని భామ అసిన్ అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసిన అసిన్ "లండన్ డ్రీమ్స్"లో నటించింది.
అందులో పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని వస్తున్న వార్తలకు అసిన్ స్పందిస్తూ.. "అగ్రస్థాయి నటులే మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న రోజులివి. సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవగన్ లాంటి నటుల సరసన నటించే అవకాశం అందరికీ రాదు. ఇందులో నాయికగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అంతేగాని ఇటువంటి చిత్రంలో కథకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనేది చూడను" అని అసిస్ చెబుతోంది.