Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
విచ్చలవిడిగా నమిత భారీ అందాలు...
అబ్బే నేను స్కిన్ షో చేయనంటూ ప్రకటించిన నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది. "బ్లాక్ స్టాలిన్" పేరుతో రెడీ అవుతున్న ఈ మలయాళ చిత్రంలో ఆమె మాజీ సెక్స్ బాంబ్ షకీలాను మించిపోయిందనే వార్తలు వినబడుతున్నాయి.
ఇందులో క్లబ్ డాన్సర్‌గా నమిత నటించింది. హీరో "బ్లాక్ స్టాలిన్"తో వేడి వేడి బెడ్‌రూమ్ సీన్స్, మరో హీరో కళాభవన్ మణితో స్విమ్ సూట్ సరదాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. పబ్లిసిటీతో హోరెత్తిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.
తెలుగులో ఇద్దరు మొనగాళ్లు పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా పోసాని కృష్ణ మురళికి జోడీగా "మిస్ చింతామణి ఎంఏ"లో నటించేందుకు నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ ముమైత్‌ను ఆపరేషన్ దుర్యోధనలో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేయించిన పోసాని ఈ చిత్రంలో అంతకంటే ఎక్కువ చేయించనున్నాడని సమాచారం. ఇకపోతే బాలయ్య చిత్రం సింహాలో గ్లామర్ పాత్ర పోషిస్తోంది నమిత.