1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Allu Arjun's House as Modeled Anil Ambani's house, Film Nagar, Hyderabad, Jubilee Hills; Megastar Chiranjeevi; Pushpa Franchise; Raka,

Allu Arjun's new House: అంబానీ తరహాలో అల్లు అర్జున్ నూతన ఇల్లు ?

Allu Arjun
Allu Arjun
ప్రస్తుతం ఫిలింనగర్ లో అల్లు అర్జున్ ఇంటి గురించి హాట్ టాపిక్ గా మారింది. రాకా సినిమాలో ఆయన నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో వుండబోతోందని చిత్ర దర్శకుడు అట్లీ విడుదల చేసిన పలు ప్రచారాలను బట్టి తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇల్లు పూర్తి కావచ్చిందని అంటున్నారు.
 
 
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ఖరీదైన విలాసవంతమైన గృహాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇంటి ఫార్మెట్ చూస్తే, అనిల్ అంబానీ ఇంటిని పోలివుంటుందని అనిపిస్తోంది. దాదాపు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ మెన్షన్ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ వ్యయం సుమారు రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇది అత్యాధునిక సౌకర్యాలు మరియు లగ్జరీ డిజైన్‌తో నిర్మించబడుతోంది. ఈ సంవత్సరం చివర్లో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం.  ఇది పూర్తయిన తర్వాత, జూబ్లీహిల్స్‌లోని అత్యంత విలాసవంతమైన గృహాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
 
పుష్ప ఫ్రాంజెయిజ్ తో పారితోషికం రూపంలో పర్సెంటేజ్ తీసుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించాడని వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా రాకా చిత్రంలో కూడా అదే ఫార్మెట్ అనుసరిస్తున్నారని ఫిలింనగర్ కథనాలు తెలియజేస్తున్నాయి.
About Writer
దేవీ
తర్వాతి కథనం
SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు