1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Anirudh Ravichander-Kavya Maran wedding on the cards? Here's what music composer's uncle says

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

anirudh - kavya maran
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత, ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్‌ను ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా తమిళ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ కామెంట్స్ చే్శారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనిరుధ్, కావ్యల గురించి మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్. ఎంతో సమర్థుడు. అయితే, ఏదో ఒక విషయం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. 
 
అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అతనికి తన శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. "నేను కూడా విన్నదాన్నే చెబుతున్నాను. కానీ, ఈ వివాహం కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారిద్దరి జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా కావ్య మారన్ గురించి వై.జి. మహేంద్రన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె కేవలం ఐపీఎల్ జట్టు యజమానురాలిగానే కాకుండా, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షతను పూర్తిగా పుణికిపుచ్చుకున్నారని, అందుకే అంత పెద్ద ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. 
 
గతంలో 'సన్ టీవీ' ఓటీటీ విభాగానికి కావ్య అధిపతిగా ఉన్నప్పటి అనుభవాన్ని పంచుకున్నారు. "ఓ ప్రాజెక్ట్ కోసం వెళ్లినప్పుడు ఆమె మమ్మల్ని ఎంతో మర్యాదగా చూసుకున్నారు. మా కథలు నచ్చి ఒకేసారి ఆరు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు తాత్కాలికంగా నిలిచిపోయినా, ఒక వ్యక్తిగా కావ్య చాలా మంచి మనసున్న వ్యక్తి" అని మహేంద్రన్ గుర్తుచేసుకున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?