1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Chinmayi warns TVK and criticises DMK for platforming MeToo accused Vedan

వేదన్‌, రాజ్‌మోహన్‌ భేటీపై చిన్మయి ఫైర్.. విజయ్ సర్కారు డీఎంకేకు భిన్నంగా..? (video)

Chinmayi
సింగర్ చిన్మయి మళ్లీ తెరపైకి వచ్చింది. సమాజంలో బాధితులైన మహిళలకు ఎలాంటి మద్దతు లభించడం లేదని.. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులు మాత్రం హీరోలు, నాయకులుగా చూపిస్తూ పెద్దపీట వేస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి ఆపాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇందుకు ఒక ఘటనను తెరపైకి తెచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ ఆరుముగమ్‌ను వేదన్ కలవడంపై చిన్మయి స్పందించారు. వేదన్, మంత్రి రాజ్ మోహన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోలను ఈ సందర్భంగా చిన్మయి పోస్టు చేశారు. హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే అయినా మునుపటి డీఎంకే సర్కారు కంటే భిన్నంగా వుంటుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 
Vedan_Rajmohan
Vedan_Rajmohan
 
సీరియస్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మంత్రిని కలవడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి పెద్ద వేదికలు కల్పించవద్దని చిన్మయి విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక పాట కోసం తాను వేదన్‌తో కలిసి పనిచేయాల్సి వస్తే.. ఆయనపై ఉన్న ఆరోపణల కారణంగా ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నానని చిన్మయి గుర్తు చేసుకున్నారు. సోషల్ యాక్టివిటీ పేరుతో మహిళల సమ్మతిని కాలరాసే పురుషుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చిన్మయి స్పష్టం చేశారు. 
 
గతంలో మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను కూడా వేదన్ కలిశారని గుర్తు చేశారు. ఇంకా ఆ వీడియోను కూడా చిన్మయి షేర్ చేశారు. కాగా వేదన్‌పై లైంగిక దాడి కేసులతో పాటు డ్రగ్స్, పులిగోరు కలిగి వున్నారనే వైల్డ్ లైఫ్ కేసులు వున్నాయి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
చిరంజీవి 158 పొల్లాచ్చిలో షెడ్యూల్‌ పూర్తి - కథానాయిక పేరు త్వరలో ప్రకటన