Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?
తెలుగు దర్శకుడు బాబీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్తలను బట్టి బాబీ చెప్పిన కథకు హృతిక్ కథతో బాగా ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పబడింది. దర్శకుడిని "నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? నువ్వు నిజంగా ఏమి తింటావు?" అని హుత్రిక్ అడిగాడు - కథ అతనికి ఎంత నచ్చిందో చూపిస్తుంది. త్వరలో సినిమా సెట్ పైకి వెళ్ళనుందని సమాచారం. అయితే చిరంజీవితో బాబీ సినిమా కూడా వుంది. మరి అతి అయ్యాక చేస్తాడో, ముందుగా చేస్తాడో తెలియాల్సి వుంది.
ఇదిలా వుండగా, కొంతకాలం గేప్ తీసుకున్న తర్వాత దర్శకుడు క్రిష్ (రాధాక్రిష్ణ) ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అది కూడా తెలుగు నూతన సంవత్సరాది ఉగాదికి శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. ఈసారి అగ్రహీరోలు కానీ పేరున్న హీరోలతో కాకుండా కొత్తవారిని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. నలుగురు హీరోలు.. నలుగురు హీరోయిన్ల కథ గా చెబుతున్నారు. స్నేహం, జీవితం, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ కథ ఓవర్ సీస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసుకున్నట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. త్వరలో వివరాలు తెలియనున్నాయి.